తమ కోడళ్లు ఎలా ఉండాలో చెప్పిన లాలూ భార్య... నెటిజన్ల ఆగ్రహం...
posted on Jun 12, 2017 6:31PM

ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ భార్య తమకు కాబోయే కోడళ్లు ఎలా ఉండాలో చెప్పుకొచ్చారు. లాలు కొడుకులు తేజశ్వి, తేజ్ ప్రతాప్ యాదవ్‌లు ప్రస్తుతం మంత్రులుగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు వారికి వివాహం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తనకు కాబోయే కోడళ్లు ఎలా ఉండాలో చెబుతున్నారు రబ్రిదేవి. తనకు కాబోయే కోడళ్లకి మాల్స్‌కి వెళ్లేఅలవాటు ఉండకూడదు అంటున్నారు. అంతేకాదు వారు ఇంటి పనులు.. బయటి పనులు చక్కగా చూసుకునేలా ఉండాలట. పెద్దల్ని గౌరవించే తత్వం ఉండాలి. అందులోనూ తేజ్‌ప్రతాప్‌కి సంస్కారం ఎక్కువ. అలాంటి వ్యక్తికి సంప్రదాయబద్ధమైన భార్య రావాలి.’ అన్నారు. అయితే ఇప్పుడు రబ్రీదేవి చేసిన వ్యాఖ్యలు దుమారమే రేపుతున్నాయి. రబ్రీదేవి ఆడపిల్లల్నిఇప్పటికీ వంటింటికే పరిమితం చేయాలని ఆమె అనుకుంటున్నారంటూ నెటిజన్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.