మంగళగిరి అమ్మాయితో ఉడాయించిన లేడీ అఘోరీ

అఘోరినంటూ గత కొంత కాలంగా ఉభయ తెలుగు రాష్ట్రాలలో హల్చల్ చేస్తున్న వ్యక్తి ఓ అమ్మాయితో పరారవ్వడం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది.  మాయమాటలు చెప్పి  తమ కుమార్తెను అఘోరి వశపరుచుకుందని యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలో అఘోరీ మంగళగిరి వచ్చిన సమయంలో పరిచయమైన బిటెక్ విద్యార్థినిని అఘోరీ వశపరుచుకుంది.  తనకు పరిచయం అయిన విద్యార్థిని కోసం అఘోరీ పలుమార్లు మంగళగిరికి వచ్చిందని చెబుతున్నారు.  

ఈ మేరకు ఆ విద్యార్థిని తండ్రి తురిమెల కోటయ్య సోమవారం మంగళగిరి పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన కోటయ్య నెలల కిందట రోడ్డు మీద నగ్నంగా హల్ చల్ చేస్తున్న అఘోరీకి పోలీసుల విజ్ణప్తి మేరకు బట్టలు కప్పిందన్నాడు. అప్పటి నుంచీ అఘోరీ తన కుమార్తె ఫోన్ నంబర్ తీసుకుని మాట్లాడేదనీ, ఒకటి రెండు సార్లు తమ ఇంటికి కూడా వచ్చిందనీ వివరించారు. అఘోరీ తన కుమార్తెను  కూతుర్ని మాయ మాటలతో మోసం చేసి ఆకుపసరు తో  లేపనాలు పూసి, వశీకరణ చేసుకొని అఘోరీల ఆశ్రమానికి యువరాణి ని చేస్తారని చెప్పి  తనవైపు తిప్పుకుందని భోరుమన్నాడు. కాగా ఇంజనీరింగ్ విద్యార్థిని సోదరుడు కూడా ఆఘోరీ తీరుపై ఆరోపణలు చేశాడు. అఘోరీ తనను లైంగికంగా వేధించిందన్నాడు. దీంతో అఘోరీ వ్యవహారం మరో సారి రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.