అర్థరాత్రి కేటీఆర్ ఏం చేశారో తెలుసా? వీడియో వైరల్..
posted on Jul 27, 2021 12:44PM
కేటీఆర్. ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి అంతటి స్థాయి. రోజంతా ఊపిరి సలపని పనులతో బిజీబిజీగా ఉంటారు. బయటకు వస్తే.. భారీ కాన్వాయ్‌తో రయ్ రయ్ మంటూ దూసుకుపోతుంటారు. మంత్రిగా హైదరాబాద్‌లో ఉంటూ బాధ్యతలు నిర్వహిస్తూనే.. అప్పుడప్పుడు తన నియోజకవర్గమైన సిరిసిల్లకు వెళ్లివస్తుంటారు. తాజాగా, ఆయన సిరిసిల్లకు వెళ్లి అర్థరాత్రి హైదరాబాద్‌కు తిరిగివస్తుండగా అనుకోని ఘటన ఆయన కళ్లబడింది. ఇక అంతే. క్షణం ఆలస్యం చేయకుండా వెంటనే స్పందించారు. కేటీఆర్ చేసిన ఆ పనికి సోషల్ మీడియాలో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
అది రాత్రి సమయం. సిరిసిల్ల-హైదరాబాద్ రూట్‌లో కేటీఆర్ కాన్వాయ్ స్పీడ్‌గా దూకుపోతోంది. చుట్టూ చీకటి. పైగా జెట్ స్పీడ్. అంత చీకటిలోనూ, అంత స్పీడ్‌లోనూ కేటీఆర్ చాలా చురుకుగా పరిసరాలను పరిశీలించారు. రోడ్డుపై యాక్సిండెట్ జరిగి పడిపోయిన ఇద్దరు యువకులను గుర్తించారు. వెంటనే తన కాన్వాయ్‌ను ఆపమని ఆదేశించారు. ఆ యువకులను తన కాన్వాయ్‌లోని వాహనంలో ఆసుపత్రికి తరలించారు. ఆ ఘటనను ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో విషయం వెలుగుచూసింది.
సోమవారం రాత్రి సిద్ధిపేట పట్టణం కాళ్లకుంట కాలనీకి చెందిన 26 ఏళ్ల జాఫర్.. 30 ఏళ్ల యాకూబ్ లు ఇద్దరూ కలిసి టూ వీలర్ మీద సిద్ధిపేట వైపు వెళుతున్నారు. మార్గ మధ్యలో బైక్ అదుపు తప్పి.. డివైడర్‌ను ఢీ కొట్టారు. ఇద్దరు యువకులు కింద పడి తీవ్రంగా గాయపడ్డారు. ఆ సమయంలోనే అటుగా వెళుతున్న మంత్రి కేటీఆర్ వెంటనే స్పందించి తన కాన్వాయ్ లోని రెండు వాహనాల్లో క్షతగాత్రులు ఇద్దరిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యుల్ని కోరారు. మంత్రి కేటీఆర్ దగ్గరుండి మరీ బాధితుల్ని ఆసుపత్రికి పంపించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయటం.. అది వైరల్‌గా మారింది. కేటీఆర్ చేసిన సాయాన్ని నెటిజన్లు అభినందిస్తున్నారు.