రాహుల్ బైక్ ర్యాలీలో అపశృతి.. కొండా సురేఖకు గాయాలు
posted on Oct 19, 2023 2:59PM
భూపాలపల్లిలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ గురువారం( అక్టోబర్ 19)బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్సు యాత్రను కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ బుధవారం (అక్టోబర్ 18)ములుగు నియోజకవర్గంలో ప్రారంభించిన సంగతి విదితమే.
ఈ బస్సు యాత్ర బుధవారం (అక్టోబర్ 18) రాత్రి భూపాలపల్లికి చేరుకుంది . రాత్రి భూపాలపల్లి జెన్ కో అతిథి గృహంలో బస చేసిన రాహుల్ గాంధీ గురువారం అక్టోబర్ 19) ఉదయం భూపాలపల్లిలోని కేటీకే ఐదవ గని నుండి బాంబుల గడ్డ వరకు నిరుద్యోగులతో బైక్ ర్యాలీ నిర్వహించారు.
అంబేద్కర్ సెంటర్ వరకు ర్యాలీ కొనసాగింది. అంబేద్కర్ సెంటర్ లో కొద్దిసేపు రాహుల్ గాంధీ స్థానికులనుద్దేశించి ప్రసంగించారు. అనంతరం రెండో రోజూ బస్సు యాత్ర ప్రారంభమైంది. అయితే ఈ బైక్ ర్యాలీలో చిన్న అపశ్రుతి చోటు చేసుకుంది. బైక్ నడుపుతూ సీనియర్ నాయకురాలు కొండా సురేఖ కిందపడిపోయారు. ఆమె ముఖానికీ, చేతులకూ గాయాలయ్యాయి.