గుట్కా నాని గుట్కాయస్వాహా!

ఈసారి ఎన్నికలలో ఏపీలో ఎన్డీయే కూటమి ఘన విజయం  సాధించడం ఖాయమైపోయింది. ట్రెండ్స్ ని పరిశీలిస్తే జగన్  అండ్ కో అక్కడో సీటు ఇక్కడో సీటు గెలుచుకుని చచ్చిపోయి  మరీ కన్ను లొట్టపోయే పరిస్థితికి చేరుకోవడం ఖాయమని  అర్థమవుతోంది. అక్కడో సీటు ఇక్కడో సీటులో ఏ సీటు 
అయినా ఉండొచ్చేమోగానీ గుడివాడ కొడాలి నాని అలియాస్  గుట్కా నాని సీటు మాత్రం ఖాయంగా వుండదని రాజకీయ  పరిశీలకులు చెబుతున్నారు. 

నీచ నికృష్టమైన జగన్ పాలనకు తోడుగా అష్టదరిద్రమైన  కొడాలి నాని ప్రవర్తనశైలి చేరడంతో ఈసారి గుట్కా నాని  ఎమ్మెల్యే పదవి గుట్కాయస్వాహా అవడం ఖాయమని  తెలుస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని, ఆయన  కుటుంబాన్ని దారుణంగా తిట్టడమే పనిగా పెట్టుకున్న కొడాలి 
నాని గుడివాడ ప్రజలకు చిరాకు పుట్టించేశారు. నాని నోట్లో  వుండే గుట్కా కంటే, నాని నోట్లోంచి వచ్చే మాటలు ఎక్కువ  కంపు కొడుతూ వుంటాయనేది అందరూ అనుకునే మాటే. ఈ  గుట్కా ప్యాకెట్ దరిద్రాన్ని ఎప్పుడు వదిలించుకుందామా అని  ఐదేళ్ళ నుంచి గుడివాడ ప్రజలు ఎదురుచూస్తున్నారు.

ప్రజల్లో  ఆదరణ కోల్పోవడంతోపాటు మరికొన్ని పరిణామాలు కూడా  గుట్కా నాని ఓటమికి ఖాయం చేస్తున్నారు. ఇప్పటి వరకు  గుడివాడ  నియోజకవర్గంలో చాలామంది వైసీపీ నాయకులు  గుట్కా రాజాకి గుడ్ బై చెప్పేసి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.  ఇప్పుడు లేటెస్ట్.గా మైనారిటీల్లో మంచి గ్రిప్పు వున్న మౌలాలీ  అనే మైనారిటీ నాయకుడు వైసీపీకి బాయ్ బాయ్ చెప్పేసి  సైకిల్ పార్టీలో చేరిపోయారు. మౌలాలీ గుడ్ బై చెప్పడం కొడాలి  నానికి పెద్ద దెబ్బేనని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu