కిరణ్‌కు అధిష్టానం పిలుపు
posted on Aug 19, 2013 7:57PM
రోజు రోజుకు రాష్ట్రంలో పరిస్థితి చేయిదాటుతుండటంతో అధిష్టానం రాష్ట్ర వ్యవహారాలపై దృష్టి పెట్టింది. ఈ మేరకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డిని డిల్లీ రావాల్సిందిగా ఆదేశించింది అధిష్టానం. రేపు ఉదయం 10 గంటలకు కిరణ్ డిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. రాష్ట్రవిభజన అంశం పై కాంగ్రెస్ పార్టీ నియమించిన ఆంటోని కమిటీతో ఆయన సమావేశం కానున్నారు. దీంతో పాటు పలువురు సీనియర్ నాయకులను కూడా కలవనున్నారు.
ఇప్పటికే రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులతో ఆందోళనగా ఉన్న కాంగ్రెస్ పార్టీ నష్టనివారణ చర్యలకు దిగింది. తెలంగాణ అంశంపై యుపిఏ భాగస్వామ్య పక్షాలు, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీలు ఆమోదం తెలిపిన తరువాత సియం ఢిల్లీ వెల్లటం ఇదే మొదటి సారి దీంతో ఈ పర్యటన ప్రాదాన్యత సంతరించుకుంది.
అయితే ఆంటోని కమిటీతో జరిగే సమావేశంలో కిరణ్ ఎలాంటి వాదన వినిపిస్తారనే దానిపైనే ఇప్పుడు అందరి దృష్టి ఉంది. సమైఖ్యగానం బలంగా వినిపించిన కిరణ్ అధిష్టానం ముందు కూడా అలాగే ఉంటారా లేక, సోనియమ్మ మాటలకు జీహుజూర్ అంటారా అనేది తేలాల్సి ఉంది.