మాట నిలుపుకున్న కిమ్... ఇకపై న్యూక్లియర్ టెస్టులు చేయం...


మొత్తానికి ఉత్తరకొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ మారినట్టే కనిపిస్తోంది. ఒకప్పుడు అణు ఆయుధాలు పరీక్షలు నిర్వహిస్తూ పక్క దేశాలకు వణుకుపుట్టించేవాడు. అయితే ఇప్పుడు న్యూక్లియర్ టెస్టులను ఇకపై చేపట్టబోమని, టెస్ట్ సైట్లను నిర్మూలిస్తామని చేసిన ప్రకటనను ఆయన నిజం చేశారు. అమెరికా యుద్ధాన్ని ఆపితే తమకు అణ్వాయుధ ప్రయోగాలతో ఎలాంటి అవసరం లేదని ఇటీవలే కిమ్ జాంగ్ ఉన్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగానే ఇప్పుడు న్యూక్లియర్ టెస్టులను ఇకపై చేపట్టబోమని తాను ఇచ్చిన మాటను నిలుపుకున్నారు. పుంగ్యే-రి న్యూక్లియర్ టెస్ట్ సైట్ ను ఉత్తరకొరియా నిర్మూలించిందని మీడియా సంస్థ జిన్హువా ప్రకటించింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu