ఈ సారి ఖైరతాబాద్ గణేశుని చేతిలో లడ్డూ ఉండదట..?

హైదరాబాద్‌లో వినాయక చవితి వచ్చిందంటే ముందుగా గుర్తొచ్చేది ఖైరతాబాద్ గణేశుడే..ఏ యేటికి ఆ యేడు భారీగా కనిపించే ఈ గణపయ్య దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఆయన చేతిలో ఉండే మహా లడ్డూ కూడా అంతే విశిష్టతను సంతరించుకుంది. ప్రతి వినాయక చవితికి తూర్పుగోదావరి జిల్లా తాపేశ్వరానికి చెందిన సురుచి స్వీట్స్ యజమాని పీవీవీఎస్ మల్లిఖార్జునరావు భారీ లడ్డూను కానుకగా పంపిస్తున్నారు. 2010 నుంచి ఆయన ఆ కార్యాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు. 2015లో 6 వేల కిలోల లడ్డూను తయారు చేయడం అప్పట్లో అంతా వింతగా చెప్పుకున్నారు. అయితే ఈ లడ్డూని పంపిణీ చేసే సమయంలో భక్తులు భారీగా ఎగబడుతుండటంతో శాంతిభద్రతల సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతో భక్తులపై లాఠీచార్జ్ చేయాల్సి రావడం..పోలీసులపై వైఖరిపై విమర్శులు చెలరేగాయి. ఈ నేపథ్యంలో లడ్డూ స్థానంలో బరువు తక్కువగా ఉండే ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో చేసిన లడ్డూను నిలిపే అవకాశాలు కనిపిస్తున్నాయని ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ కమిటీ తెలిపింది.