కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు.. స్థలం, సౌకర్యాలపై అధ్యయనం

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తరచూ మాట తప్పను, మడమ తిప్పను అని చెబుతుంటారు. విశ్వసనీయత కోల్పోను అని కూడా చెబుతుంటారు. కానీ ఐదేళ్ల తన పాలనలో జగన్ రెడ్డి ఎన్నిసార్లు మాట తప్పారో.. మరెన్ని సార్లు మడమ తిప్పారో లేక్కలేదు. ఆయన మాట ఇవ్వడం తప్పడానికే అన్నట్లుగా నెటిజన్లు పలు సందర్భాలలో సెటైర్లు కూడా వేశారు. ఇక ఆయన విశ్వసనీయత ఏంత అన్నది 2024 ఎన్నికలలో జనం ఇచ్చిన తీర్పే చెప్పేసింది. అందుకు భిన్నంగా తెలుగుదేశం అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో తన తరువాతే ఎవరైనా అని చాటుతున్నారు. 

జగన్ మోహన్ రెడ్డి కర్నూలును న్యాయరాజధాని అని ప్రకటించి.. ఆ తరువాత ఆ విషయమే మర్చిపోతే.. చంద్రబాబు కర్నూలులో హైకోర్టు బెంచ్ అని హామీ ఇచ్చి ఇప్పుడా హామీని నెరవేర్చే దిశగా వేగంగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే కర్నూలులో హైకోర్టు బెంచ్ కు అనుమతులు రాగా, అక్కడ హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు అనువైన స్థలం వసతులపై అధ్యయనం ప్రారంభమైంది. తాజాగా కర్నూలు కలెక్టర్ రంజిత్ బాషా.. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ ేశారు. హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు అవసరమైన స్థలం, వసతులపై అధ్యయనం చేయాలని ఆయన అధికారులకు ఇచ్చిన ఆదేశాల సారాంశం. 

కర్నూలులో ‘హైకోర్టు బెంచ్’ ఏర్పాటు చేస్తామని ‘ప్రజాగలం’ సభలో  హామీ ఇచ్చిన చంద్రబాబు తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ దిశగా కసరత్తు ప్రారంభించి కీలక పురోగతిని సాధించింది.  కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతూ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌కు ప్రభుత్వం లేఖ రాసింది. కర్నూలులో ఏపీ హైకోర్టు శాశ్వత ధర్మాసనాన్ని ఏర్పాటు చేయాలని కేంద్రానికి పంపాలన్న తీర్మానాన్ని ఏపీ అసెంబ్లీ ఆమోదించింది.   కర్నూలులో లోకాయుక్త, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ వంటి సంస్థలను ఏర్పాటు చేసేందుకు కూడా చంద్రబాబు ప్రభుత్వం కార్యాచరణను రెడీ చేసింది.