తెలంగాణలో కంటి వెలుగు..కంటి పరీక్షలకు ఢిల్లీ వెళ్లిన కేసీఆర్
posted on Oct 29, 2018 10:08AM

తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి,తెరాస అధినేత కేసీఆర్ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర మంతా కంటి వెలుగు పధకం ద్వారా ఉచిత కంటి పరీక్షలు,మందులు,ఉచిత కంటి ఆపరేషన్లు,కళ్ళద్దాలను అందజేశారు.తెరాస ప్రభుత్వం చేపట్టిన ఈ పధకాన్ని ప్రతి ఒక్కరు సద్వినియాగం చేసుకున్నారు.పధకంలో భాగంగా మంత్రులు సైతం తమ కళ్ళకు పరీక్షలు చేయించుకొని పధకాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు.కానీ ఇప్పుడు కేసీఆర్ మాత్రం కంటి, పంటి పరీక్షల కోసం ఢిల్లీ వెళ్తున్నారు.రాబోయే రోజుల్లో కేసీఆర్ తెరాస తరఫున అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో తీరిక లేకుండా ఉండనున్నారు.ఈ మేరకు వైద్యుల సూచనతో పరీక్షల కోసం ఢిల్లీ వెళ్లినట్లు సీఎం కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.అయితే కేసీఆర్ కంటి పరీక్షలకు ఢిల్లీ వెళ్ళటంపై పలువురు విమర్శలు చేస్తున్నారు.రాష్ట్ర ప్రజలందరికి వైద్యం చేయటానికి ఇక్కడ డాక్టర్లు ఉన్నారుగాని మన ముఖ్యమంత్రికి మాత్రం వైద్యం చేయటానికి డాక్టర్లు లేరా? అని పలువురు ఛలోక్తులు విసురుతున్నారు.మరికొందరైతే కంటి పరీక్షలకు ఢిల్లీ వెళ్తున్నారా లేక రహస్య రాజకీయ పర్యటనా? అని తమ సందేహాన్ని కూడా వ్యక్తపరుస్తున్నారు.