'ఆంధ్రా'లో కెసిఆర్ పుట్టినరోజు

 

 

KCR Birthday, KCR birthday andhrapradesh, kcr telangana, trs kcr 60 birthday

 

 

తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు పుట్టిన రోజు వేడుకలు తెలంగాణలో జరిపితే వెరైటి ఏముంటుందని అనుకున్నారో..ఏమో! సమైఖ్యవాదం వినిపిస్తున్న సమైక్యాంద్ర విద్యార్ధి జెఎసి ఆయన పుట్టిన రోజును విశాఖలోని ఆంధ్రా యూనివర్సిటీలో జరిపింది.

 

కెసిఆర్ పుట్టిన రోజు సందర్భంగా కేక్ కట్ చేసి సమైక్యాంద్రకు మద్దతు ఇవ్వాలని కోరారు.  ప్రత్యేక ఉద్యమం చేస్తున్న కెసిఆర్ కి సమైక్యాంద్ర జెఎసి ఇలా కనువిప్పు కార్యక్రమం చెప్పట్టడం విశేషమే. ఈ రోజు కెసిఆర్ 60వ ఏటలోకి ప్రవేశించారు. కెసిఆర్ నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని సమైఖ్యవాదులు కోరుకోవడం గొప్పవిషయం గా చెప్పుకోవాలి.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu