కాళేశ్వరంపై సీబీఐ విచారణకు హైకోర్టు బ్రేకులు
posted on Sep 2, 2025 12:20PM

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు, మాజీ మంత్రి హరీష్ రావులకు హైకోర్టులో ఊరట లభించింది. కాళేశ్వరంపై ఎటువంటి తొందరపాటు చర్యలూ తీసుకోవద్దంటూ హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. కాళేశ్వరంపై సీబీఐ విచారణకు హైకోర్టు బ్రేకులు వేసింది. కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలపై విచారణను సీబీఐకి అప్పగించాలన్న తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ టీఆర్ఎస్ అధినేత, మాజా ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.
వారి పిటిషన్ ను హైకోర్టు మంగళవారం (సెప్టెంబర్ 2) విచారించింది. ఈ సందర్భంగా అడ్వకేట్ జనరల్ కాళేశ్వరం కమిషన్ విచారణ నివేదిక ఆధారంగా ఎటువంటి చర్యలూ ప్రభుత్వం తీసుకోబోదనీ, ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించనుందనీ తెలిపారు. అయితే ఈ కేసులో తదుపరి విచారణ వరకూ ఎటువంటి చర్యలూ తీసుకోవద్దంటూ స్టే విధించింది. తదుపరి విచారణకు కాళేశ్వరంపై విచారణను అక్టోబర్ 7కు వాయిదా వేసింది.