ప్రభుత్వ ఆసుపత్రిలో సర్జరీ చేయించుకున్న కలెక్టర్.. సీఎం అభినందనలు
posted on Jun 16, 2025 1:52PM

ప్రభుత్వ ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేయించుకున్న కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతిని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అభినందించారు. గవర్నమెంట్ ఆస్పత్రుల్లో ఆధునిక సదుపాయాలు, అనుభవం ఉన్న వైద్యులు, సేవా దృక్పథం ఉన్న సిబ్బంది ఉన్నారు. సర్కారు దవాఖానలో నాణ్యమైన వైద్య సేవలు అందుతాయన్న నమ్మకం మాత్రమే ఇప్పుడు కావాలి. ప్రభుత్వ ఆసుపత్రిలో శస్త్ర చికిత్స చేయించుకుని ఆ నమ్మకాన్ని కలిగించిన కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతికి నా అభినందనలు" అని ఎక్స్ ద్వారా సీఎం రేవంత్ పేర్కొన్నారు.
కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి కొంతకాలంగా శ్వాస సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో, ఆమె నిన్న కరీంనగర్‌లోని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. అక్కడ ఈఎన్టీ విభాగానికి చెందిన నిపుణులైన వైద్యుల బృందం ఆమెకు సక్సెఫుల్‌గా ఎండోస్కోపీ నేసల్ సర్జరీ, సెప్టోప్లాస్టిక్టి సర్జరీలను నిర్వహించింది. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉంది.