ఘోర రోడ్డు ప్రమాదం.. లోయలో పడిన బస్సు

 

కడపలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.  బెంగళూరు నుంచి కడప వెళుతుండగా గువ్వల చెరువు ఘాట్ రోడ్డులో ప్రమాదవశాత్తూ బస్సు లోయలోపడింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. 20మందికి పైగా గాయాలయ్యాయి. పూర్తి వివరాలు తెలియాల్సి వుంది. కాగా కడప జిల్లాలో ఈ రోజు జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాదంపై మంత్రి శిద్దా రాఘవరావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu