బస్టాప్‌లో అమ్మాయి..ముద్దుపెట్టి పారిపోయిన అబ్బాయి

సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా ఖ్యాతికెక్కిన బెంగళూరు నగరంలో అమ్మాయిలపై ఆకతాయిలు రెచ్చిపోతున్నారు. ఆడపిల్ల కనిపిస్తే చాలు పోకిరీలు రెచ్చిపోతున్నారు. ఈవ్‌టీజింగ్‌లు, వేధింపులు ఎక్కువవ్వడంతో యువతులు రోడ్లమీదకు రావాలంటేనే భయపడిపోతున్నారు. తాజాగా బస్టాండ్‌లో క్యాబ్ కోసం ఎదురుచూస్తున్న యువతికి ఒక ఆకతాయి ముద్దు పెట్టి పరారయ్యాడు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన ఆడపిల్లల భద్రతను ప్రశ్నిస్తోంది. ఉత్తర భారతానికి చెందిన ఓ యువతి నగరంలోని జీవనభీమానగరలో శనివారం రాత్రి తన స్నేహితుల ఇంట్లో పార్టీ ముగించుకుని ఇంటికి వెళ్లేందుకు గాను బస్టాప్‌లో క్యాబ్‌ కోసం వేచి చూస్తోంది. ఇంతలో ఒక ఆగంతకుడు ఆమె సమీపంలోకి వెళ్లి యువతి బుగ్గపై ముద్దుపెట్టి పారిపోయాడు. భయాందోళనకు గురైన యువతి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ సాయంతో నిందితుడి కోసం గాలిస్తున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu