జయలలిత ఆస్తి వీలునామా నాదగ్గర ఉంది..!

 

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఆస్తుల వ్యవహారంపై ఇప్పటికే పలు ఆసక్తికర విషయాలు చోటుచేసుకుంటున్నాయి. ఆమె ఎస్టేట్ లో చోరీ జరగడం... పలు డాక్యుమెంట్లు ఎత్తుకెళ్లడం.. వాచ్ మెన్ దారుణహత్య.. ఇంకా ఆమె మాజీ డ్రైవర్ హత్య ఇలా ఒకదాని తరువాత ఒకటి ట్విస్ట్ లు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఆమె మేనల్లుడు దీపక్ మరో సంచలనానికి తెరతీశారు. గతంలోనే అక్రమ ఆస్తుల కేసులో జయలలితకు న్యాయస్థానం విధించిన జరిమానాను తీరుస్తానని ప్రకటించిన దీపక్.. ఇప్పుడు ఆమె ఆస్తి వీలునామాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన అత్త, జయలలిత ఆస్తులకు సంబంధించిన వీలునామా తన దగ్గర ఉందని అన్నారు. కొడనాడు ఎస్టేట్లో పార్టీకి సంబంధించిన కీలక పత్రాలు, భారీ ఎత్తున డబ్బు ఉందని, అందుకే అక్కడ హత్య, దోపిడీ జరిగిందని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో వాటిపై స్పందించిన ఆయన ‘మా అత్త జయలలిత రాసిన వీలునామా నా దగ్గరే ఉంది... అన్ని ఆస్తులూ నా పేరిట, నా సోదరి దీప పేరిట రాసి ఉన్నాయి’ అని అన్నారు. అంతేకాదు ఈ వీలునామా ప్రకారం చెన్నై పోయెస్‌ గార్డెన్‌ లోని బంగ్లా, చెన్నై పార్సన్‌ మేనర్‌ లోని రెండు కార్యాలయాలు, సెయింట్‌ మేరీస్‌ రోడ్డులోని నివాసం, కొడనాడు ఎస్టేట్‌, హైదరాబాద్‌ లోని ద్రాక్షతోట తదితర ఎనిమిది ఆస్తులు తనకు దక్కుతాయని దీపక్ జయకుమార్ వెల్లడించారు. దీంతో ఇప్పుడు దీపక్ చేసిన వ్యాఖ్యలు తమిళనాట పెద్ద చర్చాంశనీయంగా మారాయి. మరి దీనిపై ఎంత దుమారం రేగుతుందో చూడాలి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu