నేడే జయలలిత ప్రమాణ స్వీకారం

 

అక్రమాస్తుల కేసులో నుండి నిర్దోషిగా బయటపడిన జయలలిత మళ్ళీ నేడు తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈరోజు ఉదయం 11 గంటలకు మద్రాస్ యూనివర్సిటీ ఆడిటోరియంలో ఐదోసారి తమిళనాడు సీఎంగా ఆమె ప్రమాణం చేయనున్నారు. నిన్నటి వరకు ముఖ్యమంత్రి గా ఉన్న ఓ.పన్నీర్ సెల్వం తన పదవికి నిన్న రాజీనామా చేయడంతో ఆయన ఏర్పాటు చేసుకొన్న మంత్రివర్గం కూడా రద్దయిపోయింది. కనుక ఆమె 28 మంది పేర్లతో కూడిన జాబితాను నిన్న గవర్నర్ రోశయ్యకు సమర్పించారు. వారందరూ కూడా ఆమెతో బాటు ఈరోజు ప్రమాణం చేస్తారు.