50 మంది పాక్ సైనికుల తలలు తీసుకురండి...
posted on May 2, 2017 4:28PM

జమ్ము కశ్మీర్‌లోని పూంచ్ సెక్టార్‌లోకి చొరబడి భారత జవాన్ల మృతదేహాలను ముక్కలుగా చేసి పాక్ దారుణానికి పాల్పడిన సంగతి తెలిసిందే. అయితే ఇందుకు గాను భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి కూడా తెలిసిందే. ప్రతి ఒక్కరూ ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఇక పాక్ దాడిలో మృతి చెందిన ప్రేమ సాగర్ కుటుంబసభ్యులు ఈ ఘటనపై స్పందించి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రేమసాగర్ కుమార్తె సరోజ్ కూడా అదే స్థాయిలో స్పందించారు. సరోజ్ మీడియాతో మాట్లాడుతూ... 'దేశం కోసం నా తండ్రి ప్రాణ త్యాగం చేశారు. ఆయన త్యాగం వూరికే పోకూడదు. అందుకు ప్రతీకారంగా 50 మంది పాకిస్థాన్ సైనికుల తలలు తీసుకురావాలి' అని అన్నారు. ఈరోజు ప్రేమ్ సాగర్ స్వస్థలమైన ఉత్తరప్రదేశ్‌లోని డియోరియాలో ఆయనకు సైనిక లాంఛనాల ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు.