అబ‌ద్ధాల ఆస్కార్ జ‌గ‌న్‌దే.. శాలువా క‌ప్పి స‌న్మానించాల్సిందే!

నేను రాష్ట్రానికి మంచి చేశా.. త‌క్కువ రేటుకు విద్యుత్ కొనుగోలు చేశా.. అందుకు నాకు శాలువా క‌ప్పి స‌న్మానం చేయాలి.. గొప్ప‌గా పొగ‌డాలి.. అలా చేయ‌కుండా నాపై విమ‌ర్శ‌లు చేయ‌డం ఏమిటి..? ఇవీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మీడియా ముఖంగా చేసిన వ్యాఖ్య‌లు. ఒక‌ విధంగా చెప్పాలంటే.. మీడియా ముందు ఆయ‌న‌ క‌న్నీరు పెట్టుకున్నంత‌ ప‌నిచేశారు. దీంతో అయ్యో పాపం.. జ‌గ‌న్ ను ఇంత‌లా ఇబ్బంది పెడుతున్నారా అని ప్ర‌జ‌లు అనుకునేంత‌లా జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌న నాట‌కాన్ని మీడియా ముఖంగా పండించేశారు. వాస్త‌వంగా చెప్పాలంటే.. జ‌గ‌న్ కు ఇలాంటి వ్య‌వ‌హారాల్లో చాలా అనుభ‌వ‌మే ఉంది. సొంత బాబాయ్ వివేకానంద రెడ్డి హ‌త్య జ‌రిగిన స‌మ‌యంలోనూ మాయ‌మాట‌ల‌తో త‌న ప‌ట్ల‌ ప్ర‌జ‌ల్లో సానుభూతిని అమాంతం పెంచేసుకున్నారు. అయ్యో జ‌గ‌న్‌.. అయ్యో పాపం జ‌గ‌న్ అంటూ ప్ర‌జ‌లు   వైసీపీని అధికారంలోకి తెచ్చారు. ఆ త‌రువాత అర్ధ‌మైంది జ‌గ‌న్ అస‌లు రంగు. బాబాయ్ హ‌త్య కేసులో జ‌గ‌న్ ప్ర‌మేయంకూడా ఉంద‌న్న వాద‌న‌ల‌కు బ‌లం చేకూర‌డంతో ఇటీవ‌లి ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు ఓటు ద్వారా గ‌ట్టి బుద్ధి చెప్పారు. అయితే, తెలుగు రాష్ట్రాల్లోని ప్ర‌జ‌ల‌కు.. మ‌రీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్ర‌జ‌లకు ఎవ‌రైనా ఇబ్బందుల్లో ఉన్నామ‌ని క‌న్నీరు పెట్టినంత ప‌నిచేశారంటే అయ్యో పాపం అంటూ నిజానిజాలు తెలుసుకోకుండా వారి వైపుకు వెళ్లిపోతారు. వారిలోని ఆ వీక్‌నెస్ నే జ‌గ‌న్ గట్టిగా ప‌ట్టుకున్నాడు. అదానీ వ్య‌వ‌హారంలో త‌న ప్రేమ‌యం ఉన్న‌ట్లు ఆధారాల‌తో రుజువు అయిన తరువాత కూడా జ‌గ‌న్   న‌న్ను ఇబ్బంది పెడుతున్నారు.. న‌న్ను విమ‌ర్శిస్తున్నారు అంటూ ప్ర‌జ‌ల్లో సానుభూతిని పొందే ప్ర‌య‌త్నం చేశారు.  

అస‌లు విష‌యంలోకి వెళితే..  గౌత‌మ్‌ అదానీ వ్యవహారం ఏపీలో రాజకీయ రచ్చకు కారణమైంది. ముఖ్యంగా విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి జగన్‌పై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. సెకితో ఒప్పందంలో అప్ప‌టి ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి అదానీ నుంచి రూ.1,750 కోట్ల లంచం అందిందని ఎఫ్‌బీఐ, యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ క‌మిష‌న్ అమెరికాలో కోర్టుకు నివేదిక స‌మ‌ర్పించాయి. ఈ విష‌యంపై గ‌త వారం రోజులుగా రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.  కూట‌మి పార్టీల నేత‌లు జ‌గ‌న్ పై తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు చేస్తున్నారు. అయితే, జ‌గ‌న్ మాత్రం తాను  మంచి ప‌నే చేశాను, అందుకు నన్న  స‌న్మానించాలి అంటూ త‌న త‌ప్పును క‌ప్పిపుచ్చుకునే ప్ర‌య‌త్నం చేశారు. ఈ విష‌యంపై అవ‌గాహ‌న ఉన్న‌వారు జ‌గ‌న్ వ్యాఖ్య‌ల‌ను చూసి ఆశ్చ‌ర్య‌పోతున్నారు. ఇంకో అడుగు ముందుకేసి.. అమెరికా సంస్థ‌ల నివేదిక‌ల్లో తన పేరు ఎక్కడ ఉందో చేపమంటూ   మీడియా ముఖంగా జ‌గ‌న్‌ ప్ర‌శ్నించారు.  దీంతో.. త‌న త‌ప్పును క‌ప్పిపుచ్చుకునేందుకు జ‌గ‌న్ ప్ర‌య‌త్నం  చేస్తున్నారని స్ప‌ష్టంగా అర్ధ‌మ‌వుతోంది. ఎందుకంటే.. సెక్యురిటీస్ ఎక్స్చేంజ్ క‌మిష‌న్ (ఎస్ఈసీ) నివేదిక చూస్తే జ‌గ‌న్ ప్ర‌స్తావ‌న ఉంద‌ని ఎవ‌రికైనా అర్ధ‌మ‌వుతుంది. కానీ, ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదారి ప‌ట్టించేలా.. కేవ‌లం రాష్ట్ర ప్ర‌భుత్వం త‌న‌పై బుర‌ద జ‌ల్లేందుకు ఇలా చేస్తుంద‌న్న‌ట్లుగా క్రియేట్ చేసేలా మీడియా ముఖంగా జ‌గ‌న్ ప్ర‌య‌త్నం చేశారు. అదే విష‌యాన్ని త‌న సొంత మీడియా, సోష‌ల్ మీడియా ద్వారా ప‌దేప‌దే ప్ర‌చారం చేయించారు. అయితే, ఎప్ప‌టికైనా నిజ‌మే గెలుస్తుంద‌ని జ‌గ‌న్ ఇంకా గుర్తించ‌కపోవటం ఆయన అవివేకమే అని చెప్పాలి.

ఎస్ఈసీ నివేదిక‌లో ఏముంద‌న్నది ఒక సారి ప‌రిశీలిస్తే.. అదానీ విద్యుత్ కొనుగోళ్ల అంశానికి సంబంధించి పాయింట్ల వారిగా నివేదిక‌లో పేర్కొన్నారు. ఇందులో భాగంగా 80వ పాయింట్ నుంచి 84వ పాయింట్ వ‌ర‌కు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌మేయం గురించి ప్ర‌స్తావించారు. అంటే ఇక్క‌డ జ‌గ‌న్ పేరును మెన్ష‌న్ చేయ‌లేదు.. కేవ‌లం ఏపీ ముఖ్య‌మంత్రి అని మాత్ర‌మే మెన్ష‌న్ చేశారు. 2021 ఆగ‌స్టులో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రిని గౌత‌మ్ అదానీ వ్య‌క్తిగ‌తంగా క‌లిశాకే విద్యుత్ స‌ర‌ఫ‌రా ఒప్పందం ముందుకు క‌దిలింద‌ని స్ప‌ష్టంగా వివ‌రించారు. లంచం సొమ్ము సుమారు 200 మిలియ‌న్ డాల‌ర్లుగా.. అదానీ గ్రీన్స్ అంత‌ర్గ‌త రికార్డుల ద్వారా తెలుస్తోంద‌ని పేర్కొంది. ముఖ్య‌మంత్రిని క‌లిసి లంచం ఇస్తామ‌ని మాట ఇచ్చాకే సెకి ద్వారా అదానీ గ్రీన్‌, అజూర్ నుంచి విద్యుత్ కొంటామ‌ని స‌మాచారం ఇచ్చిన‌ట్లు వెల్ల‌డించింది. ఆ త‌రువాత సెకి ఆఫ‌ర్‌ను అంగీక‌రిస్తున్నామ‌ని ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింద‌ని తేల్చిచెప్పింది.

అయితే, ఇక్క‌డ ఆశ్చ‌ర్య క‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. జ‌గ‌న్ మీడియాతో మాట్లాడుతూ అమెరికా సంస్థ‌ల నివేదిక‌లో తన పేరు ఎక్కడా లేదని చెప్పుకున్నారు.  అంతేకాదు.. తనపేరు ఉన్న‌ట్లు త‌ప్పుగా ప్ర‌చారం చేస్తున్న మీడియా సంస్థ‌ల‌పైన ప‌రువు న‌ష్టం దావా వేస్తానంటూ హెచ్చ‌రిక‌లు  జారీ చేశాడు. జ‌గ‌న్ వ్యాఖ్య‌లను చూసి వైసీపీ నేత‌లు త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు. 2021లో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డితో అదానీ భేటీ అయ్యారని అంద‌రికీ తెలిసిన విష‌యమే. అమెరికా సంస్థ‌ల నివేదిక‌లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ సీఎం అని ప్ర‌స్తావించారు. అప్ప‌ట్లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కాదా ? తాను ఆ సమయంలో ముఖ్యమంత్రి పదవిలో లేను అని జగన్ ప్రజలకు చెప్పదలచుకున్ానరా?   ఇంతగా బ‌రి తెగించి జ‌గ‌న్ పచ్చి అబ‌ద్దాలు అడుతుండ‌టంతో వైసీపీ నేత‌లు సైతం చీద‌రించుకుంటున్నారు. జ‌గ‌న్ త‌న‌తీ రును మార్చుకోక‌పోతే రాబోయే కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం కావ‌డం ఖాయ‌మ‌ని వైసీపీ నేత‌లే అంటున్నారు.