ఇవెక్కడి మెంటల్ కేసులురా నాయనా!

వైసీపీ నాయకుడు జగన్‌కి అసలే ఏదో తెలియని తిక్కలాంటిదేదో వుంది. కోతి పుండు బ్రహ్మరాక్షసి అయినట్టు ఈసారి ఎలక్షన్లలో ఆయన పార్టీ ఘోరంగా ఓడిపోయి, అధికారం పోగొట్టుకోవడంతో ఆయన ఇంకా మెంటలెక్కిపోయి వున్నారు. అసలేం జరిగిందో.. ఏం జరగబోతోందో... తాను ఏం చేయాలో అర్థంగాక ఆయన బ్రెయిన్లో చిప్ కొట్టేసి తంటాలు పడుతున్నారు. అందుకే ఆయన అసెంబ్లీ సమావేశాల్లో కూడా పాల్గొనకుండా, తాడేపల్లి ప్యాలెస్‌లో రెస్టు తీసుకోకుండా పులివెందుల పారిపోయారు. పులివెందులలో ఉండటానికి కూడా మనస్కరించలేదేమో.. తన పర్మినెంట్ అడ్రస్ అయిన బెంగళూరు ప్యాలెస్‌కి వెళ్ళిపోయారు. అక్కడ కొంతకాలం రెస్టు తీసుకుని, బుర్ర మామూలుగా అయ్యాక మళ్ళీ ఏపీలోకి ఎంటరై ఇరగదీయాలన్నది ఆయన ఆలోచన. ఇలాంటి ఆలోచనలతో ఆయన బుర్ర వేడెక్కి వుంటే, దీన్ని అర్థం చేసుకోకుండా, ఆయన అభిమానులని చెప్పుకునేవారు బెంగళూరు ప్యాలెస్ దగ్గర రచ్చచేశారు. 

జగన్ బెంగళూరు ప్యాలెస్‌కి వచ్చారని తెలుసుకున్న చాలామంది కుర్రకారు ప్యాలెస్ దగ్గరకి జగనన్న జిందాబాద్ అని నినాదాలు చేస్తూ వెళ్ళారు. ప్యాలెస్‌ లోపలకి వెళ్ళి జగనన్నని ఓదార్చాలని అనుకున్నారు. కానీ, ప్యాలెస్ సెక్యూరిటీ వాళ్ళు మాత్రం, గేటు లోపలకి ఎవర్నీ రానివ్వం.. పక్కకెళ్ళి ఆడుకోండి అనేశారు. మొన్నటి వరకూ జగన్ ప్రభుత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళకే ప్యాలెస్ లోపలకి వెళ్ళే సీన్ లేదు.. వీళ్ళెవరో పనీపాటా లేని ఫ్యాన్స్ వచ్చి ప్యాలెస్ లోపలకి వెళ్తామంటే ఎలా? అయినా ప్రపంచం మొత్తాన్ని ఓదార్చే పెద్దమనిషిని వీళ్ళు ఓదార్చాలని అనుకోవడం ఏమిటి మెంటల్ కాకపోతే?

తమని ప్యాలెస్ లోపలకి వెళ్ళనివ్వకపోవడంతో సదరు మెంటల్ ఫ్యాన్స్.కి మెంటల్ మరికాస్త ముదిరింది. మమ్మల్ని లోపలకి వెళ్ళనివ్వాల్సిందే అని గేటు దగ్గర చేరి గోలగోల చేశారు. మర్యాదగా ఇక్కడ్నుంచి వెళ్తారా... పోలీసులని పిలిచి, తన్ని తరిమించాలా అని సెక్యూరిటీ వాళ్ళు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. దాంతో వాళ్ళకి కోపం పెరిగిపోయింది.. అప్పటి వరకు ‘జగన్ జిందాబాద్’ అని అరిచినవాళ్ళు ‘సైకో జగన్’, ‘జగన్ డౌన్ డౌన్’ అని అరవడం మొదలుపెట్టారు. అలా కాసేపు అరిచీ అరిచీ ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు.