వేతన జీవులకు శుభవార్త
posted on Feb 1, 2023 11:28AM
కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్ వేతన జీవులకు శుభవార్త చెప్పారు. ఆదాయ పన్ను పరిమితిని 7లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. బడ్జెట్ ప్రసంగంలో ఆమె ప్రస్తుతం 5లక్షలుగా ఉన్న ఆదాయ పన్ను పరిమితిని 7లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. ఆదాయపన్ను పరిమితిని పెంచాలన్న డిమాండ్ చాలా కాలంగా ఉన్న సంగతి తెలిసిందే. పరిమితిని పెంచడంపై వేతన జీవుల్లో హర్షం వ్యక్తం అవుతోంది.
ఇక వయోవృద్ధుల పొదుపు పథకంలో డిపాజిట్ పరిమితిని పెంచారు.ఇప్పుడు రూ.15లక్షలుగా ఉన్న పరిమితిని 30 లక్షలకు పెంచారు. ఇక మహిళల కోసం మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ ను తీసుకువస్తున్నట్లు పేర్కొన్నారు.
రెండేళ్ల పాటు అమలులో ఉండే ఈ పథకంలో డిపాజిట్ పై 7.5శాతం వడ్డీ ఇస్తారు. ఈ పథకం కింద గరిష్టంగా రెండు లక్షల రూపాయలు డిపాజిట్ చేసుకోవచ్చు.