పుతిన్ కు మళ్లీ ఐఎస్ఐఎస్ హెచ్చరికలు..
posted on Dec 3, 2015 5:26PM

ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు రష్యా అధ్యక్షుడు పుతిన్ కు గతంలో హెచ్చరికలు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మరోసారి ఓ వీడియో ద్వారా హెచ్చరికలు జారీ చేశారు. ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు ఓ రష్యన్ ని రష్యా గూఢాచారిగా అనుమానించి.. అతని చంపుతూ ఓ 8 నిమిషాలు నిడువు ఉండే వీడియోను విడుదల చేశారు. అయితే మొదట ఆరు నిమిషాలు అతనిని హింసించి.. అతను రష్యా గూఢాచారినే అని చెప్పినట్టు ఉండగా తరువాత పుతిన్ కు హెచ్చరికులు జారీ చేసినట్టు ఉంది. మీకు మనశ్శాంతి లేకుండా చేస్తాం....మీ కుమారులును హతం చేస్తాం...మీ ఇళ్లను పేల్చేస్తాం...ప్రతి రష్యన్ సైనికుడి దాడిలో చనిపోయిన ప్రతి వ్యక్తికి ఇక్కడ ధ్వంసమైన ప్రతి ఇంటికి తాము బదులు తీర్చుకుంటామని హెచ్చరిక జారీ చేశారు. దీంతో రష్య ప్రభుత్వం మరోసారి అలెర్ట్ అయింది.