హైదరాబాద్ కొంప ముంచిన ఒకే ఒక్క ఓవర్‌

 

ఐపీఎల్‌ 2018లో విజయబావుటా ఎగరవేద్దాం అనుకున్న హైదరాబాద్‌ సన్‌రైజర్స్‌ ఆశలు కుప్పకూలిపోయాయి. ఫైనల్లో భాగంగా 179 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించిన హైదరాబాద్ ప్రారంభంలోనే ఒక వికెట్టుని తీసి మంచి విశ్వాసంతో కనిపించింది. ఆ తర్వాత పెద్దగా వికెట్లు పడకపోయినా, కట్టుదిట్టమైన బౌలింగ్ వేస్తూ పరుగులు రాకుండా జాగ్రత్తపడింది. కానీ ఒకే ఒక్క ఓవర్‌ హైదరాబాద్ కొంప ముంచేసింది. సందీప్‌ శర్మ వేసిన 13వ ఓవర్లో షేన్ వాట్సన్‌ ఏకంగా 26 పరుగులు బాదేశాడు. దాంతో అంకెలన్నీ తారుమారైపోయాయి. హైదరాబాద్‌ పరాజయం ఖరారైపోయింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu