కవితదే ఇండో స్పిరిట్ కంపెనీ!?

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌తో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పీకల్లోతు ఇరుక్కున్నారా? ఈ కేసులో  దాఖలు  చేసిన చార్జిషీట్ లోదాఖలు చేసిన తాజా చార్జిషీట్‌లో ఈడీ ఈ విషయమే వెల్లడించింది.  ఢిల్లీలో లిక్కర్ వ్యాపారం చేసిన ఇండో స్పిరిట్ కంపెనీకి   కల్వకుంట్ల కవితే ఓనర్ అని చార్జిషీట్ లో ఈడీ పేర్కొంది. మొత్తంగా ఈడీ తాజా చార్జ్ షీట్ లో కవిత పేరును 28 సార్లు పేర్కొంది.  శరత్ రెడ్డి, మాగుంట రాఘవ్ రెడ్డితో కలిసి కవిత లిక్కర్ వ్యాపారం చేశారని వివరించింది.

ఈ వ్యాపారానికి అరుణ్ రామచంద్ర పిళ్లైను కవిత బినామీగా పెట్టుకున్నారని పేర్కొంది. ఈడీ దాఖలు చేసిన 181 పేజీల చార్జ్‌షీట్లో 28 సార్లు కవిత పేరును ప్రస్తావనకు వచ్చింది. కవిత, మాగుంట రాఘవ్‌, శరత్‌రెడ్డి నిర్వహిస్తున్న సౌత్‌గ్రూప్ దే ఈ కుంభకోణంలో  కీలక  పాత్ర అని ఈడీ చార్జ్ షీట్ లో పేర్కొంది. ఈ కేసులో అప్రూవర్ గా మారిన దినేష్ అరోరా వాంగ్మూలం మేరకు హైదరాబాద్, ఢిల్లీ స్టార్ హోటళ్లలో పలుమార్లు సమావేశాలు జరిగాయి. కవిత పలుమార్లు ఫేస్ టైమ్ ద్వారా నిందితులతో మాట్లాడి కలసి వ్యాపారం చేస్తున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు.

సమీర్ మహేంద్ర కవితను ఆమె నివాసంలో కలిసి చర్చలు కూడా జరిపారని ఈడీ చార్జ్ షీట్ లో పేర్కొంది. ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో దక్షిణాది నుంచి ఆప్ కి చెందిన కొందరు నేతలకు హవాలా మార్గంలో ముడుపులు అందినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ పేర్కొంది.  ఓ వైపు సీబీఐ, మరో వైపు ఈడీ కేసులతో కల్వికుంట్ల  కవిత చిక్కుల్లో పడ్డారని న్యాయనిపుణులు పేర్కొన్నారు. ఈడీ తాజా చార్జిషీట్ ను బట్టి ఆమెను నిందితురాలిగా పేర్కొని అరెస్టు చేసే అవకాశాలున్నాయని అంటున్నారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu