హైదరాబాద్‌లో కుండపోత వర్షం..పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ జామ్

 

హైదరాబాద్‌లో కుండపోత వర్షం కురిస్తోంది. ఒక్కసారిగా వాతావరణం మారింది. దీంతో పలు ప్రాంతాల్లో వర్షం దంచికొడుతోంది. దీంతో రోడ్లులన్నీ జలమయం అయ్యాయి. భారీగా కురిసిన వానతో నగర వాసులు తడిసి ముద్దయ్యారు. వర్షానికి వివిధ పనులపై బయటకు వచ్చిన వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

నగరంలోని బంజారాహిల్స్, జూబ్లిహిల్స్, అమీర్‌పేట్, సోమాజిగూడ, పంజాగుట్ట, బేగంబజార్, కోఠి, సుల్తాన్ బజార్, అబిడ్స్, బషీర్ బాగ్, నాంపల్లి, లిబర్టీ, హిమాయత్ నగర్, నారాయణ గూడ, లక్డీకాపుల్, ఖైరతాబాద్, ట్యాంక్ బండ్ తదితర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. జీహెచ్‌ఎంసీ, పోలీసులు రంగంలోకి దిగారు. సహాయక చర్యలు ప్రారంభించారు. భారీ వర్షాలు నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu