ఈ మూడు పనులు చేసే మగాళ్లకు తమ భార్యల మీద అస్సలు కోపముండదట!

భార్యాభర్తలకు ఒకరి మీద మరొకరికి కోపం రావడం సహజం. ఆ కోపం చాలా మటుకు ఎలా వస్తుందో అలాగే వెళ్లిపోతుంది కూడా. కొందరి విషయాలలో మాత్రమే కోపాలు కాస్తా గొడవలకు, అవి కాస్తా తెగదెంపులకు దారి తీస్తాయి. ఎలాంటి గొడవలు జరిగినా, ఏ సమస్య వచ్చినా అవి చాలా వరకు పరిష్కారం అవడం అనేది భార్యాభర్తలు వాటికి రియాక్ట్ అవ్వడం మీదనే ఆధారపడి ఉంటుంది. ఇంకొక విషయం ఏమిటంటే.. భార్యాభర్తల సాధారణ ప్రవర్తన కూడా వారికి తమ భాగస్వామి మీద కోపం వస్తుందా? రాదా అనే విషయాన్ని స్పష్టం చేస్తుంది. సాధారణంగా మగవారు చేసే మూడు పనులు వారికి తమ భార్యల మీద కోపం వస్తుందా రాదా అనే విషయాన్ని స్పష్టం చేస్తుందట. ఇంతకీ భర్తలు చేసే ఆ మూడు పనులేంటంటే..

సహాయం..

 పనిని జెండర్ ఆధారంగా విభజించకుండా అన్ని పనులు అందరూ చేయవచ్చు అనే విషయాన్ని అర్థం చేసుకుంటారో అలాంటి భర్తలు భార్యలను అస్సలు కోపగించుకోరట. పైపెచ్చు ఇలాంటి భర్తలు తమ భార్యలకు ఎంచక్కా సహాయం కూడా చేస్తారట. ఇక్కడ ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే భర్తలు సహాయం చేస్తే భార్యలు చాలా సంతోషిస్తారు.  భర్తలకు అనుగుణంగా ఉంటారు. భార్యలు కూడా  ఇలాంటి భర్తలకు కోపం తెప్పించే పనులు అస్సలు చెయ్యరు.

ప్రేను వ్యక్తం చేయడం..

చాలామంది మగాళ్లకు భార్య మీద బోలెడు ప్రేమ ఉంటుంది. కానీ అదంతా ఇంట్లోనో లేక పడక గదిలోనో మాత్రమే బయట పెడుతుంటారు. కానీ భార్య మీద ఉన్న ప్రేమను ఎలాంటి సంకోచం లేకుండా బహిరంగంగా బయటపెట్టే భర్తలకు తమ భార్యలంటే ఎనలేని ప్రేమ ఉంటుంది. ఇలాంటి భర్తలకు అస్సలు భార్యలమీద కోపం అనేది కల్లో కూడా ఉండేమో అన్నంత ప్రేమగా ఉంటారు. నలుగురిలో భార్య మీద కోప్పడే మగాడు కాదు.. నలుగురిలో భార్య మీద ప్రేమ కురిపించే మగాడిని చూసి భార్య గర్వపడుతుంది. అలాంటి భర్తను గౌరవిస్తుంది.

సమయాన్ని  గడపడం..

భార్య కోసం సమయాన్ని వెచ్చించే భర్త ఎప్పుడూ భార్య మీద కోపం చేసుకోడు. ఎందుకంటే అతను భార్య కోసం సమయాన్ని వెచ్చించడంలోనే అతని ప్రేమ వ్యక్తం అవుతుంది. ఇక తన కోసం సమయం కేటాయిచే  భర్తంటే భార్యకు కూడా గౌరవం. ఇద్దరూ కలిసి గడిపే సమయంలో భార్యాభర్తలు ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకోవడం, ఒకరికొకరు మద్దతుగా ఉండటం ఇలా అన్నీ వారి బంధాన్ని దృఢంగా మారుస్తాయి.

                                                *నిశ్శబ్ద.