నడి సముద్రంలో తగలబడిన ఓడ

 

పశ్చిమ గ్రీసు నుంచి ఇటలీకి 478 మంది ప్రయాణికులు, సిబ్బందితో బయల్దేరిన ఓడ అడ్రియాటిక్ సముద్ర జలాల మధ్యలో వుండగా మంటల్లో చిక్కుకుంది. ఈ మంటల్లో ఒకరు చనిపోయారు. గ్రీక్ అధికారులు ఈ ఓడలోని ప్రయాణికులను రక్షించే పనిలో వున్నారు. ఇప్పటి వరకు 149 మందిని రక్షించారు. కాలిపోతున్న ఓడలోంచి మరో ఓడలోకి ప్రయాణికులను మారుస్తున్నారు. కాలుతున్న ఓడలో ఇంకా ఎవరైనా మరణించారా అనే విషయం ఇంకా తెలియరాలేదు. ఓడలో 200 వాహనాలు కూడా వున్నాయి. కాలిపోతున్న ఓడని చల్లార్చడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ప్రమాదం జరిగిన ప్రదేశంలో బలమైన చలిగాలులు వీస్తున్నాయి. కాలిపోతున్న నౌక మీద అదుపు లేకపోవడంతో బలమైన గాలులకు ఓడ తన ఇష్టం వచ్చిన దిశగా వెళ్ళిపోతోంది. పరిస్థితిని అదుపులోకం తేవడానికి తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి.