దూసుకొస్తున్న హుదూద్ తుఫాను
posted on Oct 8, 2014 3:03PM
అండమాన్ పరిసరాల్లోని సముద్రంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుఫానుగా మారింది. ఈ తుఫానుకు అధికారులు ‘హుదూద్’ అని పేరు పెట్టారు. ప్రస్తుతం లాంగ్ ఐలండ్ సమీపంతో వున్న తుఫాను కొద్ది గంటల్లో నికోబార్ తీరాన్ని దాటే అవకాశం వుంది. ఈ తుఫాను పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించి, 24 గంటల్లో పెను తుఫానుగా మారే అవకాశం వుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈనెల 12వ తేదీన విశాఖపట్నం - ఒరిస్సాలోని గోపాల్‌పూర్ మధ్యలో ఈ తుఫాను తీరం దాటనుంది. తుఫాను ప్రభావం కారణంగా అండమాన్ పరిసరాల్లో సముద్రం అల్లకల్లోలంగా వుంది. మత్స్యకారులు వేటకు వెళ్ళొద్దని హెచ్చరికలు జారీ అయ్యాయి. ఈనెల 11వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తీరంలో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీచే అవకాశం వుంది. 11వ తేదీ నుంచి తుఫాను ప్రభావం వల్ల ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం వుందని అధికారులు చెబుతున్నారు.