చంద్రబాబుపై కథనాలకు గౌరవ డాక్టరేట్

చంద్రబాబునాయుడు  తీసుకున్న నిర్ణయాలు సైతం ఇప్పటికీ ఎప్పటికీ నిత్య నూతనంగానే ఉంటాయి.తాను రాసిన విశ్లేషణాత్

క కథనాలతో పాటు ఎన్నికల ముందు జనబాహుళ్యంలో అత్యంత ఆదరణ పొందిన చంద్రబాబు ఎక్స్ ఓ అనంత భావ జాలికుడు పుస్తకం లోని అంశాలు తనకు గౌరవం దక్కేందుకు దోహదపడ్డాయని  గుంటూరుకు చెందిన సీనియర్ పాత్రికేయుడు శాఖమూరు శ్రీనివాస ప్రసాద్ అన్నారు. ఆయన కు గౌరవ డాక్టరేట్ లభించింది.  అమెరికాలోని సౌత్ వెస్టర్న్ అమెరికన్ యూనివర్సిటీ జర్నలిజం విభాగానికి సంబంధించి ఈ డాక్టరేట్ అందజేసింది. ఢిల్లీలోని హోటల్ సామ్రాట్ లో  జరిగిన కార్యక్రమంలో కెనడా కాన్సులేట్ జనరల్ డాక్టర్ జానీష్ దర్బియా చేతుల మీదుగా ఈ డాక్టరేట్ అందుకున్నారు. కార్యక్రమంలో సౌత్ వెస్టర్న్ అమెరికన్ యూనివర్సిటీ ట్రస్టీ డాక్టర్ కె ఎల్ కంజు, ప్రఖ్యాత గజల్ గాయకురాలు పద్మశ్రీ పెనాజ్ మసానీ, నేపాల్ కాన్సులెట్ జనరల్ డాక్టర్ కే ఎల్ శర్మ, సీనియర్ జర్నలిస్టు అభిషేక్ తదితర ప్రముఖులతో పాటు, పారిశ్రామిక, వ్యాపార, సామాజిక సేవా రంగాలకు చెందిన పలువురు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పై రాసిన విశ్లేషణాత్మక కథనాలు, చంద్రబాబు X.O -  అనంత భావజాలికుడు పుస్తకం ను పరిగణలోకి తీసుకొని తనకు ఈ పురస్కారాన్ని అందజేసినట్లు భావిస్తున్నాను అని శ్రీనివాస ప్రసాద్ తెలిపారు. తనకు ఈ  గౌరవం లభించటానికి ఎపి రేరా మాజీ చైర్మన్ డాక్టర్ రామనాథ్ వెలమాటి మార్గదర్శనమే ప్రధాన కారణమని ఆయన పేర్కొన్నారు. తనకు లభించిన ఈ గౌరవం డాక్టర్ రామనాథ్ కే దక్కుతుందని ఆయన చెప్పారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu