రక్షణ రహస్యాలకు హనీట్రాప్ ముప్పు!

పూర్వ కాలంలో శత్రు రాజ్యాల రహస్యాలు తెలుసుకునేందుకు వేగులు..(మనం గూఢ చారులు అని ఇప్పుడు అంటున్నాం) శత్రు రాజ్యాల్లోకి ప్రవేశించి అక్కడ ఎవరినో ఒకరిని మచ్చిక చేసుకునే వారట. వారి ద్వారా రాజ్యంలో సమస్యలు, లోతుపాతులు, లోగుట్టు తెలుసుకుని దానికి తమ రాజుకు చేరవేశేవారని చెబుతుంటారు.  ఆ తరువాతి కాలంలో శత్రు దేశాల రహస్యాలను తెలుసుకునేందుకు గూఢ చారులను వినియోగించేవారు.

జేమ్స్ బాండ్, గూఢచారి 116 వంటి  సినిమాలు కూడా ఈ గూఢచర్యం కథాంశంతో కూడిన సినిమాలే. ఇప్పుడు వేగులు  ఇటువంటి వేగులు, గూఢచారులతో పని లేకుండా కొన్ని దేశాలు ఇతర దేశాల నుంచి తమకు కావలసిన రహస్యాలు చులాగ్గా సంపాదించేస్తున్నారు. అందుకు వారు ఉపయోగిస్తున్నది ‘హనీ ట్రాప్’ ఇప్పుడు దేశ రక్షణ రహస్యాలకు ‘హనీ’ ట్రాప్ ముంపు పొంచి ఉందని పరిశీలకులు అంటున్నారు. ఇంతకీ ఈ హనీ ట్రాప్ అంటే ఏమిటంటే.. అత్యంత కీలకమైన రహస్యాలను రాబట్టేందుకు అమ్మాయిల వలపు వలను ప్రయోగించడం. దేశ క్షిపణి అభివృద్ధి రహస్యాలను తెలుసుకునేందుకు ఒక ఇంజనీర్ పై పాక్ హనీట్రాప్ ను ప్రయోగించింది. దీంతో ఆ ఇంజనీర్ రెండేళ్ల పాటు అంటే 2019 నుంచి 2011 వరకూ క్షిపణులకు సంబంధించి కీలక సమాచారాన్ని శత్రుదేశానికి చేరవేసినట్లు తేలింది. ఆ ఇంజనీర్ ను హనీట్రాప్ లో చిక్కుకునే టట్లు చేయడానికి సామాజిక మాధ్యమాన్నే శత్రుదేశం మాధ్యమంగా ఎన్నుకుంది. సామాజిక మాధ్యమంద్వారా పరిచయమైన యువతి వలపు వలలో పడిన ఇంజినీర్ అత్యంక కీలకమైన రహస్యాలను, కొన్ని చిత్రాలను, పత్రాలను కూడా ఆమెకు అందజేశాడు. డీఆర్ డీఏలో పని చేసే ఇతరులెవరూ ఇతడి చౌర్యాన్ని గుర్తించలేకపోవడమే ఆశ్చర్యమని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు.   పాక్‌ రహస్య గూఢచార సంస్థ (ఐఎస్‌ఐ) తరఫున మన దేశంలో చాలా మంది ఏజెంట్లుగా, స్లీపర్‌ సెల్స్‌గా పని చేస్తున్నారు. బయటపడిన కేసులు కొన్ని మాత్రమే. వెలుగులోనికి రాని ఇటువంటి వి చాలా ఉన్నాయన్నది నిఘావర్గాల అనుమానం.

  గత సంవత్సరం జూలైలో బికనీర్‌ కి చెందిన హబీబూర్‌ రెహమాన్‌ అనే పాక్‌ గూఢచారిని అరెస్టు చేశారు. పోఖ్రాన్‌లోని ఆర్మీ బేస్‌ క్యాంపు నుంచి అతడు రహస్య సమాచారాన్ని పాకిస్తాన్‌కి చేరవేసినట్టు పోలీసులు గుర్తించారు. పాక్‌ గూఢచారులకు అతడు కొన్ని మ్యాపులను, కోడ్‌ సమాచారాన్నికూడా అందిం చినట్టు దర్యాప్తులోతేలింది.అతడికి పంకజ్‌ కౌర్‌ అనే కానిస్టేబుల్‌ ఈ సమాచారాన్ని అందజేసినట్టు తెలియ వచ్చింది.

ఆగ్రా కంటోన్మెంట్‌లో పని చేస్తున్న కౌర్‌నికూడా అరెస్టు చేశారు.రెహమాన్‌ బంధువులు పాక్‌లోని సింధ్‌లో నివసిస్తున్నారనీ, వారిని కలుసు కోవడానికి అతడు తరచూ వెళ్తుంటాడనీ,ఆర్మీ బేస్‌ క్యాం ప్‌కి కూరగాయలు సరఫరా చేసే హబీబూర్‌ రెహమాన్‌ కౌర్‌ ద్వారా సమాచారాన్ని సేకరించి సింధ్‌ వెళ్ళినప్పుడు ఐఎస్‌ఐ అధికారులకు అందజేసేవాడని పోలీసుల దర్యాప్తులో తేలింది.