రెండో రోజు సీబీఐ విచారణలో హిమాచల్ సీఎం...

 

హిమాచల్ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ రెండో రోజు సీబీఐ విచారణలో పాల్గొన్నారు. ఆదాయానికి మించిన ఆస్తలకు సంబంధించి కేసులో వీరభద్ర సింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈనేపథ్యంలో ఆయన్ను సీబీఐ విచారిస్తుంది. నిన్న ఏడు గంటల పాటు ఆయనను విచారించిన సీబీఐ ఆయన సరైన సమాధానాలు ఇవ్వని కారణంగా ఈ రోజు కూడా విచారిస్తుంది. దీంతో సీబీఐ విచారణ కోసం ఈ రోజు ఉదయమే వీరభద్రసింగ్ ఇక్కడి సీబీఐ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు.