దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు
posted on Nov 29, 2024 4:41PM
ఎపిలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరికొద్ది గంటల్లో తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలియ జేసింది. . నైరుతి బంగాళ ఖాతంలో అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఇది తమిళనాడులోని కారైకాల్ వద్ద తీరం దాటితోందని అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు హెచ్చరించారు. నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. దక్షిణ కోస్తాలో గంటకు 55 నుంచి 75 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపారు. కృష్ణపట్నం, నిజాంపట్నం వద్ద మూడో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మిగిలిన పోర్టుల్లో ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. దీని ప్రభావంలో తెలంగాణ జిల్లాల్లో వాతావరణం చల్లబడింది.