ఎపిలో మద్యం షాపులకు భారీగా దరఖాస్తులు 

గత వైసీపీ ప్రభుత్వం మద్యం షాపుల్లో చీప్ లిక్కర్ విక్రయాలు చేసి ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడింది. 
వినియోగదారులకు తక్కువ ధరకే నాణ్యమైన మద్యాన్ని అందించాలనే లక్ష్యంతో ఎపి ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకొచ్చింది.  దీనిలో భాగంగా ఇటీవల 3,336 షాపులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. మద్యం షాపు పొందేందుకు దరఖాస్తు ఫీజ్ రెండు లక్షలుగా కూటమి ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.   ఇప్పటివరకు దాదాపు 20 వేల దరఖాస్తులు వచ్చాయి.   వీటి ద్వారా ప్రభుత్వానికి దాదాపు రూ.400కోట్ల ఆదాయం వచ్చింది. తర్వాతి దశలో గీత కార్మికులకు 10 శాతమైన 340 షాపులు కేటాయించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం ప్రకటించింది. పారదర్శకతే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోంది. ఈ నెల 11 వ తేదీ చివరి రోజు కావడంతో భారీగా దరఖాస్తులు వచ్చాయి. మద్యం షాపులకు  తెలంగాణలోని మహబూబ్ నగర్, నల్గొండ, మెదక్ జిల్లాల నుంచి భారీగా టెండర్లు వచ్చాయి. చివరి రోజు కావడంతో భారీగా దరఖాస్తులొచ్చాయి.