రేపిస్టు అరెస్టు

 

ఓ యువతి మీద సామూహిక అత్యాచారానికి పాల్పడి, ఆ ఘటనను ఇంటర్నెట్‌లో పెట్టిన రేపిస్టులలో ఒకరిని హర్యానాలోని మీవత్ పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు అరెస్టు చేశారు. కొద్ది రోజుల క్రితం ఏడుగురు యువకులు ఒక యువతి మీద అత్యాచారం జరిపారు. ఆ వీడియోను ఇంటర్నెట్‌లో పెట్టారు. ఈ విషయం మీద ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సదరు వీడియో ఆధారంగా పరిశోధన జరిపన పోలీసులు ఆ ఏడుగురిలో ఒకరిని అరెస్టు చేశారు. ఒక వ్యక్తి దొరికాడు కాబట్టి మిగతా ఆరుగురు దొరికిపోతారని పోలీసులు చెబుతున్నారు.