రోడ్డు ప్రమాదంలో కేంద్రమంత్రి గోపీనాథ్ ముండే దుర్మరణం
posted on Jun 3, 2014 9:14AM
.jpg)
నరేంద్రమోడీకి, మహారాష్ట్ర ప్రజలకి, దేశ ప్రజలకి పెద్ద షాకింగ్ న్యూస్. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గోపీనాథ్ ముండే మంగళవారం ఉదయం న్యూఢిల్లీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. న్యూఢిల్లీ ఎయిర్ పోర్ట్ దగ్గర ముండే కాన్వాయ్ ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ముండే తీవ్రంగా గాయపడ్డారు. దాంతో ఆయన్ని ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ గోపీనాథ్ ముండే మరణించారు.భారత ప్రధాని నరేంద్ర మోడీ కేబినెట్లో గోపినాథ్ ముండే కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. మహారాష్ట్రలోని బీడ్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా 16వ లోక్సభకు గోపినాథ్ ముండే ఎన్నికయ్యారు. పరిపాలనాదక్షుడిగా పేరున్న ముండే ఇలా దుర్మరణం పాలు కావడం మోడీ కేబినెట్‌కి, మహారాష్ట్ర ప్రజలకి, దేశ ప్రజలకి ఒక దుర్వార్త.