జీహెచ్ఎంసీ ఎన్నికలు.. వైసీపీతో టీఆర్ఎస్ పొత్తు..?

తెలంగాణ అధికార పార్టీ జీహెచ్ఎంసీ ఎన్నికలను వచ్చే ఏడాది జనవరిలో నిర్వహిస్తానని చెప్పిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి అప్పుడే పార్టీలు ఎవరి వ్యూహాల్లో వారు ఉన్నారు. ఇక టీఆర్ఎస్ అయితే ఇప్పటికే హైదరాబాద్లో తాము చేపట్టిన పథకాలతో భారీ ఫ్లేక్సీలు ఏర్పాటు చేశారు కూడా. అయితే ఈ గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్ర‌భావం చాలా త‌క్కువే అని చెప్పొచ్చు. దానికి తోడు టీఆర్ఎస్ పై వస్తున్న ఆరోపణలు ఒకవైపు.. ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్ ను కూడా మార్చివేశారు. కానీ గ్రేటర్ లో టీడీపీ, బీజేపీ, ఓల్డ్ సిటీలో ఎంఐఎం పార్టీలు కాస్త బలంగానే ఉన్నాయి. ఇక వైసీపీ పరిస్థితి కూడా పర్వాలేదు.

అయితే టీఆర్ఎస్ పార్టీ మాత్రం ఏదో పైకి గెలుపు తమదే అని చెబుతున్నా ఆపార్టీకి అంత సీన్ లేదని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. కానీ టీఆర్ఎస్ కు కూడా తమ పరిస్థితి తెలిసి ఎంఐఎం, వైకాపాతో పొత్తు పెట్టుకోవాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. మరి వైకాపా.. టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుంటుందో లేదో చూడాలి. ఒకవేళ వైకాపా తో టీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటే వైకాపా పార్టీ తన బలాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవేళ పొత్తు పెట్టుకోకపోతే వైకాపా ఎన్ని సీట్లు గెలుచుకుంటుందో చూడాలి. మొత్తానికి ఏది తెలియాలన్నా ఎన్నికల వరకూ ఆగాల్సిందే.