'గే వరుడు కావలెను'... సూపర్ రెస్పాన్స్
posted on May 23, 2015 1:21PM

రెండు రోజుల క్రితం వచ్చిన 'గే వరుడు కావలెను' అను ప్రకటన సోషల్ మీడియాలో హల్ చల్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రకటనకు అనూహ్యమైన స్పందన వచ్చిందని, భారత్ తోపాటు ప్రపంచ వ్యాప్తంగా 73 మంది నుండి ప్రపోజల్స్ వచ్చాయని గే హరీష్ తల్లి పద్మ అయ్యర్ తెలిపారు. ఈ ప్రకటనకు వచ్చిన స్పందన చూస్తుంటే చాలా సంతోషంగా ఉందని, తన వయసు 58 సంవత్సరాలు తను ఈ లోకాన్ని విడిచి వెళ్లేలోపు తన కుమారుడిని ఒక ఇంటి వాడిని చేద్దామనే ఉద్దేశంతోనే ప్రకటన ఇచ్చానని పద్మ అయ్యర్ తెలిపారు. ఒక్క భారత్ లోనే కాకుండా అమెరికా, ఆస్ట్రేలియా, యూకే, సౌదీ అరేబియా నుండి మంచి స్పందన వచ్చిందని అన్నారు. అబుదాబి నుంచి ఓ వ్యక్తి తనను పెళ్లి చేసుకుంటే ఆయనకున్న రాజభవనంలాంటి ఇల్లు రాసిస్తానన్నారని హరీష్ చెప్పారు.