స్ఫూర్తిమంతం గాంధీ జీవితం : కేసీఆర్

కుల, మత, వర్గాలకు అతీతంగా సర్వజనుల హితమే తన మతమని చాటిన మహాత్మా గాంధీ ఆదర్శాలు భారతదేశానికి తక్షణ అవసరమని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.

దేశ సమగ్రతను, ఐక్యతను నిలబెట్టేందుకు తన జీవితాన్ని అర్పించిన మహాత్మా గాంధీ.. భారత పురోగమనానికి సదా ఓ దిక్సూచిలా నిలుస్తారని అన్నారు.  జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా  సోమవారం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్  ఆయన్ను స్మరించుకున్నారు.

 నమ్మిన లక్ష్యం కోసం   ఆటంకాలన్నిటినీ అధిగమిస్తూ విజయ తీరాలకు చేరాలనే స్పూర్తిని.. గాంధీ జీవితం  అందించిందన్నారు. గాంధీజీ ఆశయాల వెలుగులో ముందుకు సాగుతామని సీఎం కేసీఆర్ ప్రతిజ్ణ చేశారు. నేటి యువత గాంధీ ఆశయాలకనుగుణంగా నడుచుకోవాలని సూచించారు.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu