దటీజ్ గాంధీ హస్పటల్..ఎమ్మెల్యే భార్య అయితే మాకేంటీ..?

ఆసుపత్రులందు గాంధీ ఆసుపత్రి వేరయా అంటారు జనం..ఎందుకంటే అక్కడ ఏం జరగాలన్నా చేయి తడపాల్సిందే. అంతులేని నిర్లక్ష్యానికి, అవినీతికి గాంధీ ఆసుపత్రి కేరాఫ్ అడ్రస్. అలాంటి గాంధీ దవాఖానా గొప్పదనం మరోసారి బయటపడింది. ఏకంగా ఎమ్మెల్యే భార్యను కూడా పట్టించుకోకుండా వ్యవహరించి అక్కడి సిబ్బంది మరోసారి విమర్శలపాలయ్యారు. వివరాల్లోకి వెళితే దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి భార్య సుజాత తన సోదరుడి కుమారుడిని చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తీసుకొచ్చారు. రోగిని తీసుకువెళ్లడానికి ఎవరైనా వస్తారేమోనని వేచి చూసిన ఆమెకు నిరాశే ఎదురైంది. కనీసం ఒక్కరంటే ఒక్కరు కూడా ఎమ్మెల్యే భార్యను పట్టించుకోలేదు. దీంతో చేసేది లేక ఆమే స్వయంగా వీల్‌చైర్ తీసుకొచ్చి అతడిని కూర్చోబెట్టి ఆస్పత్రిలోకి తీసుకువెళ్లారు. ఒక ఎమ్మెల్యే భార్య పరిస్థితే ఇలా ఉంటే సామాన్యుల పరిస్థితి ఏంటని కొందరు ఆశ్ఛర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరిగినా అధికారులు కానీ..సిబ్బంది కానీ స్పందించలేదు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu