ఆ చిత్రానికి కాంగ్రెస్ భయపడుతోందా?
posted on May 2, 2015 5:41PM
'గేమ్' చిత్రం కాంగ్రెస్ ను భయపెడుతోందా? 'గేమ్' చిత్రానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధం ఏంటి అనుకుంటున్నారా... ప్రముఖ కన్నడ, తమిశ దర్శకుడు ఏఎంఆర్ రమేశ్ సమాజంలో జరిగే యధార్ధ సంఘటనల ఆధారంగా సినిమాలు తీస్తుంటాడు. అప్పట్లో రాజీవ్ గాంధీ హత్యపై 'సైనైడ్', స్మగ్లర్ వీరప్పన్ ఎన్ కౌంటర్ ఆధారంగా 'అట్టహాస' చిత్రాలు తీసి సంచలనం సృష్టించాడు. ఇప్పుడు కాంగ్రెస్ మాజీ కేంద్రమంత్రి శశి థరూర్ భార్య సునంద పుష్కర్ ఆత్మహత్య సంఘటన ఆధారంగా చిత్రాన్ని నిర్మిస్తున్నారని, ఇందులో సునంద పుష్కర్ పాత్రలో మనిషాకోయిరాలా నటిస్తున్నారని ప్రచారం కావడంతో కాంగ్రెస్ పార్టీ కంగారుపడుతోంది. ఇంతకు సినిమా స్కిప్ట్ ఏమిటి అని తెలుసుకోవాలని, వారి నుంచి కూపీ లాగేందుకు తెగ ప్రయాత్నిస్తున్నారని సమాచారం. దీనికోసం కాంగ్రెస్ లో చేరిన కుష్బూ కూడా అసులు విషయం ఏమిటో తెలుసుకునేందుకు తన వంతు కృషి చేస్తున్నారట. అయితే దర్శకుడు రమేశ్ మాత్రం ఈ ప్రచారాన్ని ఖండించనూలేదు, అలాగని ఒప్పుకోలేదు, కానీ... ఓ వీఐపీ మరణం చుట్టూ తిరిగే క్రైమ్ స్టోరీ అని ముక్తసరిగా చెప్పాడు.