తాడిచెట్లతో వైఫై

 

ఇప్పుడు తాడిచెట్లనుండి కూడా ఉచిత వైఫై అందిస్తున్నారు. అలాంటి ఇలాంటి తాడిచెట్లు కాదు అవి... స్మార్ట్ తాడిచెట్లు. తాడిచెట్లతో వైఫై... ఎలా.. ఎక్కడ అనుకుంటున్నారు కదా. దుబాయ్ మునిసిపాలిటీ వాళ్లు 'స్మార్ట్ పామ్ సోలార్ టెక్ హబ్' ప్రాజెక్టు ద్వారా ఈ ఉచిత వైఫై సౌకర్యం అందిస్తున్నారు. అంతేకాదు ఈ స్మార్ట్ తాడిచెట్ల నుండి వైఫై సిగ్నల్ మాత్రమే కాదు, ఫోన్లు ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఛార్జింగ్ పాయింట్లు కూడా ఉన్నాయి. ఒక చెట్టుకు 12 ఛార్జింగ్ పాయింట్లు ఉంటాయి. ఈ తాడిచెట్ల వల్ల ఇంకో లాభం కూడా ఉంది అదేంటంటే.. కెమెరా, లౌడ్ స్పీకర్లు అమర్చి ఉండటంతో బీచ్ లో వాతావరణం ఎలా ఉండబోతోందన్న హెచ్చరికులు కూడా బయటకు వినిపిస్తుంటారు. ఈ తాడిచెట్లు ఆరుమీటర్ల ఎత్తుంటాయి. దీనికి కావల్సిన విద్యుత్ కూడా సోలార్ పవర్ ద్వారానే అందుతుంది. ఈ సందర్భంగా దుబాయ్ మునిసిపాలిటీ డైరెక్టర్ జనరల్ హుస్సేన్ నాజర్ లూటా మాట్లాడుతూ త్వరలోనే దుబాయ్లో ఉన్న బీచ్లన్నీ కూడా స్మార్ట్ బీచ్ లు అయిపోతాయని అన్నారు.