సియాచిన్ లో విరిగిన మంచుకొండ చర్యలు.. ఆరుగురు మృతి

 

సియాచిన్ లో రెస్క్యూ ఆపరేషన్ కష్టతరంగా మారింది. మంచు తుఫాన్ విపరీతంగా ఉండడం తో మృతి చెందిన వారిని బయటకు తీసుకు రావడం ఇంకాస్త ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తుంది. మొత్తం ఆరుగురు చనిపోగా అందులో నలుగురు సైనికులు.. ఇద్దరు పౌరులుగా అనుమానిస్తున్నారు. సియాచిన్ హిమనీనదం పై ఆర్మీ పహారా కాస్తున్న ప్రదేశంలో ఒక్కసారి గా వచ్చిన మంచు తుఫాన్ లో ఎనిమిది మంది చిక్కుకపోయారు. గంటల తరబడి మంచులో ఉండిపోవడంతో అందులో ఆరుగురు చనిపోయారు. మృతి చెందిన వారిలో ఇద్దరు పోర్టర్ లు ఉన్నట్లు తెలుస్తోంది.

మొత్తం ఎనిమిది మందితో పెట్రోలింగ్ గ్రూప్ మంచు తుఫాన్ వచ్చిన ప్రదేశంలో విధులు నిర్వహిస్తోంది అని సమాచారం. అసలే 19వేల అడుగుల ఎత్తు, ఓ వైపు గడ్డకట్టిన మంచు, మరోవైపు మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రత, ఆక్సిజన్ అందని పరిస్థితి లో సైనికుల చనిపోయినట్లుగా ఆర్మీ అధికారులు తెలిపారు. తుఫాను తర్వాత ఆర్మీ పెద్దెత్తున రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించింది. మంచు చర్యల్లో నుంచి ఎనిమిది మందిని బయటకు తీసింది. అయితే ఆ ప్రయత్నాల్లో ఇద్దరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. గాయపడిన ఆ ఇద్దరికీ దగ్గర లోని మిలటరీ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ జరుగుతుంది.