గురువారంనాడు కలాం అంత్యక్రియలు

 

మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం అంత్యక్రియలు గురువారం ఉదయం 10.30 గంటలకు ఆయన స్వస్థలమయిన రామేశ్వరంలో జరుపుతారు. కనుక రేపు మధ్యాహ్నం ఆయన భౌతిక కాయాన్ని రామేశ్వరానికి తరలించడానికి కేంద్రప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ప్రజలు, ప్రముఖుల సందర్శనార్ధం రేపు రాత్రి ఏడు గంటల వరకు ఆయన భౌతిక కాయాన్ని స్థానిక పాఠశాలలో ఉంచుతారు. మరునాడు ఉదయం ముస్లిం మతాచారాల ప్రకారం స్థానిక మొహిద్బిన్ మశీదుకు చెందిన శ్మశానవాటికలో ఖననం చేస్తారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu