స్వతంత్ర భారత దేశంలో తొలి బడ్జెట్ ప్రవేశపెట్టిందెవరో తెలుసా?

మరి కొద్ద సేపటిలో కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఆమె పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశ పెట్టడం వరుసగా ఇది ఐదో సారి.

ఏడున్నర దశాబ్దాల స్వతంత్ర భారత దేశంలో ఇలా వరుసగా ఐదు మార్లు వార్షిక పద్దును ప్రవేశపెట్టిన వారు నిర్మలకు ముందు ఐదుగురు మాత్రమే. అయితే అసలు స్వతంత్ర భారత దేశంలో మొట్టమొదటి సారిగా బడ్జెట్ ప్రవేశపెట్టిందెవరో తెలుసా? ఎప్పుడో తెలుసా?

1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. అదే సంవత్సరం నవంబర్ 26న పార్లమెంటులో దేశ తొలి బడ్జెట్ ప్రవేశపెట్టబడింది. దేశ తొలి విత్త మంత్రి ఆర్కే షణ్ముషం చెట్టి తొలి బడ్జెట్ ప్రవేశ పెట్టారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu