చంద్రబాబుపై అసత్య ప్రచారం... ఈసీ ఆదేశం మేరకు సజ్జల భార్గవ్ పై కేసు నమోదు 

వైసీపీ ప్రభుత్వంలో    అడ్డూ, అదుపు లేకుండా వ్యవహరిస్తున్న భజనపరులకు ఎన్నికల కమిషన్  కట్టడి చేసింది . నా కెవ్వరూ  అడ్డూ  లేరు అనుకున్నవారిపై కేసులు నమోదవుతున్నాయి. ప్రభుత్వం మారితే ప్రత్యర్థులపై కేసులు నమోదవుతాయి. కానీ వైసీపీ ప్రభుత్వ హాయంలోనే కేసులు నమోదు కావడం గమనార్హం. కర్మ సిద్దాంతం ప్రకారం నువ్వు ఏమిస్తావో తిరిగి నువ్వు అందే పొందుతావు. ఇన్నాళ్లు ప్రత్యర్థుల మీద అక్రమ కేసులు బనాయించిన వైసీపీ ప్రభుత్వం ఎన్నికల కమిషన్ ఆదేశాలమేరకు తలొగ్గాల్సి వచ్చింది.స్వంత పార్టీ నేతలపై కేసులు నమోదు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.   వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియాలో ఇంఛార్జ్ సజ్జల భార్గవ్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. భార్గవ్ పై 171f, 171g, 505(2), రెడ్ విత్120బి ఐపీసీ సెక్షన్ల ప్రకారం కేసు ఫైల్ అయ్యింది. వైఎస్సార్‌సీపీ‌ సోషల్ మీడియాలో తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబుపై అసత్య ప్రచారం చేస్తున్నారంటూ.. ఆ పార్టీ సీనియర్ నేత వర్లరామయ్య ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన ఈసీ కేసు నమోదు చేయాలని సీఐడీని ఆదేశించగా.. సీఐడీ కేసు నమోదు చేసింది.సజ్జల భార్గవ్ ఆధ్వర్యంలో ఓటర్లను, పింఛన్ లబ్ధిదారులను తప్పుదోవ పట్టించేలా ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా ప్రచారం చేశారని టీడీపీ నేత వర్ల రామయ్య ఈసీకి ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా పింఛన్ల ఇంటికి ఇవ్వకుండా చంద్రబాబు అడ్డుకున్నారని వైఎస్సార్‌సీపీ తప్పుడు ప్రచారం చేశారని టీడీపీ చెబుతోంది. రాష్ట్రంలో వృద్ధులకు ఏప్రిల్ 1న పింఛన్లు రాకుండా చంద్రబాబు అడ్డుకున్నారని.. సోషల్‌ మీడియాలో ప్రచారం జరిగిందని.. రాష్ట్ర వ్యాప్తంగా ఐవీఆర్‌ఎస్‌ ద్వారా ప్రచారం చేశారని ఆరోపించారు. ఈ ఫిర్యాదుతో సీఐడీ కేసు నమోదు చేయగా.. ఈ మేరకు ఎన్నికల కమిషన్‌కు సీఐడీ నుంచి నివేదిక వెళ్లాల్సి ఉంది. అనంతరం ఎలాంటి చర్యలు ఉంటాయన్నది చూడాలి.