41 కోట్ల యూజర్ల ఫోన్ నంబర్లు ఆన్ లైన్ లో.. ఫేస్‌బుక్ ఘన కార్యం

 

ఫేస్‌బుక్ లో మునిగి తేలే యూజర్లకు షాకింగ్ న్యూస్. మీరు కనుక మీ ఫోన్ నంబర్ ద్వారా ఫేస్‌బుక్ లో లాగిన్ అవుతుంటే ఒక్కసారి చెక్ చేసుకోండి. తాజాగా ఫేస్‌బుక్ 41 కోట్ల యూజర్ల ఫోన్ నంబర్లు ఆన్ లైన్ లో లీకైనట్లుగా టెక్ క్రంచ్ కథనం. ఇవన్నీ ఫేస్‌బుక్‌కు లింక్ అయిన ఫోన్ నెంబర్లేనని ఇవి ఓపెన్ ఆన్‌లైన్‌ డేటాబేస్‌లో ఉన్నాయని ఆ సంస్థ తెలిపింది. వీటిలో 13.3 కోట్లు అమెరికా యూజర్లు, 1.8 కోట్లు యూకే యూజర్లు, 5 కోట్లకు పైగా వియత్నాం యూజర్ల ఫోన్ నెంబర్లు ఉన్నట్లుగా టెక్ క్రంచ్ తెలియచేసింది. ఐతే భారత్ కు సంబంధించిన వివరాలు మాత్రం తెలియవలసి ఉంది. ఫేస్‌బుక్ ఐడి ద్వారానే ఈ వివరాలు బయటికి వచ్చాయని దీని ఫలితంగానే యూజర్లకు సిం స్వాపింగ్, సిం జాకింగ్, స్పామ్ కాల్స్ వంటి సమస్యలు వస్తున్నాయని తెలుస్తోంది.

జీడీఐ ఫౌండేషన్‌కు చెందిన సెక్యూరిటీ రీసెర్చర్ సన్యామ్ జైన్ ఈ డేటాబేస్‌ని గుర్తించడం జరిగింది . దీనిపైఅయన మరింత ఆరా తీయడంతో ఈ డేటా బేస్‌ను ఆఫ్‌లైన్‌లోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. ఆ డేటాబేస్ లో ఒక్క ఫోన్ నెంబర్లు మాత్రమే కాక యూజర్ పేరు, జెండర్, లొకేషన్ లాంటి వివరాలు కూడా లీకయినట్లుగా తెలుస్తోంది. అయితే ఇది పాత డేటా అని, గతంలోనే తాము దీనిని డిలిట్ చేశామని ఫేస్‌బుక్ అధికార ప్రతినిధి ప్రకటించారు. ఈ డేటా వల్ల ప్రస్తుతం ఉన్న ఫేస్‌బుక్ అకౌంట్స్‌కు వచ్చిన ముప్పేమీ లేదని ఆ ప్రతినిధి వెల్లడించారు. ఐతే ఫేస్‌బుక్‌ డేటా లీక్ కావడం ఇదేమి మొదటి సారి కాదు. కొంత కలం క్రితం 8.7 కోట్ల యూజర్ల డేటా స్కామ్ కేంబ్రిడ్జ్ అనలిటికా ఫేస్‌బుక్‌కు తలనొప్పులు తెచ్చిన విషయం తెలిసిందే.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu