ఈటల భూమిపై విచారణ ప్రారంభం.. కేసీఆర్ ఫోటోతో మంత్రి మేడే సందేశం
posted on May 1, 2021 9:53AM
తెలంగాణలో సంచలనంగా మారిన వైద్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ భూకబ్జాలకు సంబంధించి విచారణ ప్రారంభమైంది. మెదక్ జిల్లా అచ్చంపేట గ్రామంలో లో విచారణ జరుపుతున్నారు విజిలెన్స్ అధికారులు. రైతుల నుండి పిర్యాదు లు తీసుకుంటున్నారు రెవెన్యూ అధికారులు. సీఎం కేసీఆర్ కు లేఖ రాసిన రైతుల నుండి సమాచారం సేకరిస్తున్నారు విజులెన్స్ ఎస్పి మనోహర్, సీఐ సతీష్ రెడ్డి. మంత్రి ఈటలపై వచ్చిన భూకబ్జా ఆరోపణలపై విచారణ జరిపి నివేదిక అందించాలని శుక్రవారం సాయంత్రం సీఎం కేసీఆర్ ఆదేశించారు. దీంతో విజిలెన్స్ అధికారులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. సీఎం ఆదేశించిన కొన్ని గంటల్లోనే అధికారులు గ్రామానికి చేరుకుని విచారణ జరుపుతున్నారు.
కరీంనగర్ జిల్లా జిల్లా హుజురాబాద్ నుంచి మంత్రి ఈటలను కలిసేందుకు హుజురాబాద్ నియోజకవర్గానికి చెందిన టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నేతలు హైదరాబాద్ బయలదేరారు. భూ కబ్జా ఆరోపణలు నేపథ్యంలో మంత్రి ఈటెల రాజేందర్ కు సంఘీభావం ప్రకటించేందుకు ఆయన సొంత నియోజకవర్గంలోని హుజురాబాద్ నుంచి హైదరాబాద్ తరలి వెళ్లారు పలువురు కార్యకర్తలు అభిమానులు.కేసీఆర్ కుటుంబ సభ్యులు చేసిన కుట్రలో భాగమే భూ కబ్జా ఆరోపణలు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ కుటుంబ పాలన అంతమయ్యే రోజులు దగ్గర పడ్డాయి అంటున్నారు ఈటల అభిమానులు. కష్టపడే తత్వం, ప్రజాభిమానం ఉన్న ఈటల రాజేందర్ ను తప్పించాలనే కుట్రలో భాగమే ఈ అసత్య ఆరోపణలు చేశారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మంత్రి అనుచరులు.
మరోవైపు కేసీఆర్ ఫోటోతో మే డే శుభాకాంక్షలు చెబుతూ సందేశం విడుదల చేశారు మంత్రి ఈటల రాజేంద. ఇక వరంగల్ అర్బన్ జిల్లాలో మంత్రి ఈటల రాజేందర్ సొంతూరు కమలాపూర్ లోని ఆయన ఇంటి వద్ద పోలీసుల భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.