ముగిసిన నిజం గెలవాలి యాత్ర
posted on Apr 13, 2024 7:53PM
చంద్రబాబు అక్రమ అరెస్ట్‌తో మనస్థాపం చెందిన కుటుంబాలను పరామర్శించాలనే ఉద్దేశంలో ‘‘నిజం గెలవాలి’’ పేరుతో భువనేశ్వరి యాత్రను మొదలుపెట్టారు. గతేడాది అక్టోబర్ 25న చిత్తూరు జిల్లాలో ఈ కార్యక్రమం మొదలైంది. దాదాపు ఆరు నెలల పాటు నిజం గెలివాలి కొనసాగింది. మొత్తం 25 పార్లమెంటు నియోజకవర్గాలు, 95 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కార్యక్రమంలో సాగింది. ఇందులో భాగంగా చంద్రబాబు అరెస్టు సమయంలో మనస్తాపానికి గురై చనిపోయిన 203 మంది కార్యకర్తల కుటుంబాలను భువనేశ్వరి ఓదార్చారు. అంతే కాకుండా వారికి ఆర్థిక సాయం అందజేశారు. ఒక్కో కార్యకర్త కుటుంబానికి రూ.3 లక్షల ఆర్థిక సాయం చేశారు. కార్యకర్తల కుటుంబాలకు పార్టీ అన్ని వేళలా అండగా నిలుస్తుందంటూ భరోసా ఇచ్చారు. ఆఖరి రోజు నారా భువనేశ్వరి తిరువూరులో పర్యటించారు.