బిఆర్ఎస్ ఎమ్మెల్సీ దండె విఠల్ ఎన్నిక చెల్లదు: హైకోర్టు 

బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి దండె విఠల్ ఎన్నిక చెల్లదని హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఆదిలాబాద్ స్థానిక సంస్థల నియోజవర్గం నుంచి బిఆర్‌ఎస్ అభ్యర్థిగా 2022లో దండె విఠల్ ఎన్నికయ్యారు. తాను నామినేషన్ ఉపసంహరించుకోలేదని, తన సంతకాలు ఫోర్జరీ చేశారని పాతిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఫోర్జరీని తేల్చేందుకు పత్రాలను కేంద్ర ఫోరెన్సిక్ లేబోరెటరీ పంపించాలని కోర్టు తెలిపింది. ఇరుపక్షాల వాదనలు విన్న తరువాత విఠల్ ఎన్నికల రద్దు చేస్తున్నామని తీర్పు వెలువరించింది.
దండె విఠల్ ఆదిలాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా 2022లో ఎన్నికయ్యారు. పాతిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. రాజేశ్వర్ రెడ్డిని పోటీ నుంచి తప్పించడమే లక్ష్యంగా విఠల్ ఆయన సంతకాన్ని ఫోర్జరీ చేసినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. రాజేశ్వర్ రెడ్డి పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ఫోర్జరీ సంతకాలతో రిటర్నింగ్ అధికారికి దరఖాస్తు ఇచ్చారు. దీంతో రాజేశ్వర్ రెడ్డ నామినేషన్ ఉపసంహరణకు గురైంది.అయితే తాను నామినేషన్‌ను ఉపసంహరించుకోలేదని, తన సంతకాలు ఫోర్జరీ చేశారని పాతిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి అప్పుడే హైకోర్టును ఆశ్రయించారు. విఠల్ ఎన్నిక చెల్లదని ప్రకటించాలని కోర్టును కోరారు. ఫోర్జరీని తేల్చేందుకు పత్రాలను కేంద్ర ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించాలని కోరారు. ఆ తర్వాత ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం విఠల్ ఎన్నికను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది.