సర్వే: ఢిల్లీ బీజేపీదే.. కేజ్రీవాల్ క్లోజ్..

 

ఢిల్లీ శాసన సభ ఎన్నికల్లో బీజేపీకి తిరుగులేని ఆధిక్యం వస్తుందని ఏబీపీ న్యూస్ - నీల్సన్ నిర్వహించిన ఒపీనియన్ పోల్స్‌లో వెల్లడయింది. గత ఎన్నికలలో మెజారిటీ సాధించలేపోయిన బీజేపీ ఈసారి ఎన్నికలలో మెజారిటీ సాధించి మేజిక్ ఫిగర్ దాటుతుందని ఒపీనియన్ పోల్స్ పేర్కొన్నాయి. ప్రధానమంత్రి మోడీ హవాతో బీజేపీ 46 స్థానాలు గెలుచుకోవచ్చునని ఈ సర్వే తెలిపింది. ఆమ్ ఆద్మీ పార్టీకి 18 స్థానాలు, కాంగ్రెస్ పార్టీకి 5 స్థానాలు దక్కవచ్చునని తెలిపింది. 63 శాతం మంది మద్దతుతో ప్రధాని నరేంద్ర మోడీకి అత్యంత ప్రజాధరణ ఉన్న వ్యక్తిగా నిలిచారు. ఈ విషయంలో అరవింద్ కేజ్రీవాల్‌కు 25 శాతం, ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్‌కి 12 శాతం మంది మద్దతు పలికారు.